ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దళితులపై జరుగుతున్న దమనకాండకు ప్రకాష్ ఉదంతం ఒక తాజా ఉదాహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 01:31 PM

ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కి హాట్సాఫ్.. నిరంకుశ ప్రభుత్వం పై మీ పోరాటం స్ఫూర్తినిచ్చింది అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు.పోలీస్ శాఖలో ఉన్న లోతుపాతులని, వారి జీత బత్యాల మీద ప్రభుత్వం స్పందించాలి అని కానిస్టేబుల్ నిరసన తెలిపిన సంగతి ఇప్పుడు రాష్ట్రమంతటా వైరల్ గా మారిపోయింది.  


ఈ విషయం పై స్పందించిన లోకేష్ మాట్లాడుతూ...  సేవ్ ఏపీ పోలీస్ అంటూ సీఎం జగన్ రెడ్డి గారిని ప్రశ్నించే హక్కు ఒక దళిత కానిస్టేబుల్ కి లేదా? అదే నిరసన మీ సొంత సామాజిక వర్గం వారి నుండి వస్తే వేటు వేసేవారా జగన్ రెడ్డి గారు? అని ప్రశ్నించారు.  


రాష్ట్రంలో  దళితులపై జరుగుతున్న దమనకాండకు ప్రకాష్ ఉదంతం ఒక తాజా ఉదాహరణ. పోలీసులకు రావాల్సిన బకాయిల గురించి ప్రశ్నిస్తే లేని కేసుని తెరపైకి తెచ్చి వేటు వేసారు. తక్షణమే ఆయన్ని సర్వీసులోకి తీసుకోవాలి. పోలీసులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు పెండింగ్ పెట్టిన బకాయిలు అన్ని విడుదల చెయ్యాలి అని డిమాండ్ చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com