గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీ నేతలతో సాగుతోంది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్లి వారికి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా తమకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వద్ద పలువురు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్న వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు అని ప్రజలు అంటున్నారు అని ప్రజాప్రతినిధులు అంటున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు తమ దృష్టికి వచ్చిన సమస్యలను, అధికారులతో చర్చించి వెంటనే అక్కడికక్కడే పరిష్కారమార్గం చూపుతున్నారు.