ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయం నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కాంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ దేవాలయం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వరుసలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ లోని మాయాపూర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం రూపుదిద్దుకుంటోంది. దీన్ని టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియంగా నామకరణం చేశారు. 2023లో ఇది పూర్తికానుంది.