ప్రపంచంలోనే మొట్టమొదటిసారి హైడ్రోజన్ తో నడిచే రైలును ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ ఇంధన రైలును జర్మనీలోని లోయర్ సాక్సోనీలో ప్రారంభించారు. నాలుగేళ్ల క్రితం దీని ట్రయల్స్ మొదలవ్వగా ఇప్పుడు జర్మనీలో డీజిల్ రైళ్ల స్థానంలో ఇవి నడవనున్నాయి. ఫ్రెంచ్ తయారీ సంస్థ అయిన అల్స్టోమ్ ఈ రైలును తయారు చేసింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ డ్రైవ్‌లతో కూడిన 14 రైళ్లు పట్టాలపై ఈ ఏడాది చివరికి నడవనున్నాయి.