శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు ఇఫ్లో 1,97,372 క్యూసెక్కులుగా ఉండగా.. 1,42,177 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.80 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 215.80 TMCలు కాగా.. ప్రస్తుతం 214.36 TMCల నీరు నిల్వ ఉంది