అతి త్వరలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ ఫిజిషియన్ విధానం ప్రారంభిస్తామని మంత్రి విడదల రజని తెలిపారు. దీనికోసం 176 మంది మెడికల్ ఆఫీసర్లను, 1,681 మంది మిడ్ లెవల్ హెల్ ప్రొవైడర్లను నియమిస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారికి 'ఫ్యామిలీ ఫిజిషియన్' విధానం ద్వారా అదనంగా వైద్యసేవలు అందుతాయని అన్నారు. వైద్యులు, ANMలు వారి ఇళ్లకు వెళ్లి సేవలందిస్తారని తెలిపారు.