ఉపాధ్యాయులంతా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్కూల్ అటెండెన్స్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి మాన్యువల్ అటెండెన్స్ పరిగణనలోకి తీసుకునేది లేదని, ఈ యాప్ నుంచి ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు మినహాయింపు ఇచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లు లేనివారు, ఇతర సిబ్బంది ఫోన్లు వాడాలని సూచించింది. రేపటి లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి కావాలని ఆదేశించింది.