రామేశ్వరం పోయినా శనేశ్వరం పోన్నట్లుగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఇంకా కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై జాక్వెలిన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు నుంచి జాక్వెలిన్‌కు బుధవారం నోటీసులు జారీ అయ్యాయి.
మనీ ల్యాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది. సుఖేశ్ చంద్రశేఖర్‌పై నమోదైన రూ.200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో జాక్వెలిన్ పేరును చేరుస్తూ ఈడీ గతంలోనే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగానే ఆమెకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa