చట్ట వ్యతిరేక జూద కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని కృష్ణా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కి రాబడిన సమాచారం మేరకు గన్నవరం డిఎస్పి విజయపాల్ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ సిఐ సతీష్ మరియు హనుమాన్ జంక్షన్, వీరవల్లి ఎస్సైలు సూర్య శ్రీనివాస్ మరియు సుబ్రహ్మణ్యం , సిబ్బందితో కలిసి పామాయిల్ తోటల్లో మెరుపు దాడి నిర్వహించారు.
ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి 7 పందెం రాయుళ్లను, 10 కోడి కత్తులు,2,300 నగదును, 43 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని వారిపై హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది.