వినాయక చవితి నవరాత్రి వేడుకలు అనంతరం కాకినాడ పట్టణ, గ్రామీణ పరిధిలలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే కాకినాడ వార్ఫ్ రోడ్డు, 1టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, కమర్షియల్ రోడ్ లోని టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎదురుగా ఉన్న ప్రదేశం, కాకినాడ గ్రామీణ పరిధిలోని NTR బీచ్ తదితర నిమజ్జన ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించిన స్థానిక పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఫైర్ డిపార్ట్మెంట్ వారితో సమీక్షించి, నిమజ్జన ప్రదేశాల వద్ద బ్యారీకేడింగ్, క్రేన్లు, ఈతగాళ్లను, రాత్రిపూట లైటింగ్ ఏర్పాట్లు చేసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సరిపడా సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు SB DSPs శ్రీ M.అంబికా ప్రసాద్ శ్రీ M.వెంకటేశ్వరరావు, SDPO కాకినాడ శ్రీ V.భీమారావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానిక CIలు, ఫైర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.