తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలం కేటాయించాలని వడ్రంగులు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోరారు. ఆయన సూచనల మేరకు చంద్రగిరి కొత్తపేట గుర్రాలగుంట చెరువు కట్ట పక్కన సర్వే నంబరు 1479 లో 10 సెంట్లు స్థలాన్ని కేటాయించారు. అయితే స్థలం ఆక్రమణ గురైనట్లు సంఘ సభ్యులు ఎమ్మార్వో శిరీషకు ఫిర్యాదు చేయడంతో ఆక్రమణ తొలగింపు చర్యలు చేపట్టారు.