కేరళలోని తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్, ఎమ్మెల్యే సచిన్ దేవ్ ల వివాహం సెప్టెంబర్ 4న జరగనుంది. తిరువనంతపురంలోని ఏకేజీ హాల్ లో సింపుల్ గా జరగనుంది. సోషల్ మీడియా వేదికగా అందరిని ఆహ్వానించారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐలో పని చేసిన వీరు అనూహ్యంగా సీపీఎం తరపున ఎన్నికల్లో పోటి చేసి ఘన విజయం సాధించారు. ఆర్య రాజేంద్రన్ 21ఏళ్లకే మేయర్ అయ్యారు. దేశంలోనే అతి చిన్న వయస్సులో మేయర్ అయ్యి ఆమె రికార్డు సాధించారు. వీరి జీవితం హాయిగా సాగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.