నాడు -నేడు పధకం క్రింద అదనపు తరగతిగదుల నిర్మాణం చేపట్టి విద్యా వసతుల కల్పనకు మన ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు కైకలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఓరియంటల్ పాఠశాలలో నాడు-నేడు ఫేజ్ 2 క్రింద రూ. 20. లక్షల నిధులతో చేపట్టబోవు పనులకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులుతో కలిసి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ముందుగా అతిధులకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు విష్ణుమూర్తి , పాఠశాల విద్యాకమిటీ కుమారి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్ , సర్పంచ్ డి. ఎం. నవరత్నకుమారి, షేక్ రఫీ, తోట మహేష్ తదితరులు పాల్గొన్నారు.