ఎన్డీఏలో టీడీపీ చేరుతుందన్న ప్రచారంపై చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరతామని ప్రచారం చేసేవారే జవాబు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే గతంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని, తాము ఏం చేసినా రాష్ట్రం కోసమే చేస్తామని చెప్పారు.ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని విమర్శించారు.