అమిత్ షాను కలవాల్సిన ఖర్మ జూనియర్ ఎన్టీఆర్ కు ఏంటని సీపీఐ నేత నారాయణ ప్రశ్నించారు. గొప్ప రాజకీయ చరిత్ర కల్గిన కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ క్రిమినల్ అయిన షా దగ్గరకు ఎందుకు వెళ్లాలని నిలదీశారు. బీజేపీ సినిమా నటుల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోందని, వారి ద్వారానే తెలంగాణలో 'టిఆర్ యస్' ను బలహీన పరచాలని చూస్తోందని నారాయణ విమర్శించారు.