ఏపీలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 5.42 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 6.11 గంటలకు కానుంది.