విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని త్వరగా దర్శనం జరిగేలా చూడాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ ఢిల్లీ రావు, సిపి కాంతి రానా టాటా, అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ నియంత్రణలో ఉండటంవల్ల ప్రతిరోజు వేలాదిమంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేశారు.