పెనగలూరు మండలం కట్టవారిపల్లి పంచాయతీ రేగుంటవారిపల్లి, కమ్మపల్లి గ్రామంలో నిర్వహించిన గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి పాల్గొన్నారు. జగనన్న సంక్షేమ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వారన్నారు.
శనివారం పల్లెల్లోని ప్రతి ఇంటి గడపకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలుపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వరప్రసాద్ గారు, జడ్పీటీసీ సుబ్బారాయుడు, సర్పంచ్ శివయ్య నాయుడు, హౌసింగ్ డిఇ కుప్పు స్వామి ఏపీవో మురళి తదితరులు పాల్గొన్నారు.