“ఎలాంటి అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడలేదు' రేషన్ షాపు వద్ద కామారెడ్డి కలెక్టర్ ని ప్రశ్నించడంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. 'ఏ కలెక్టర్ ప్రవర్తనను అంచనా వేసేందుకు నేను ఇక్కడ లేను. కలెక్టర్ తో అభ్యంతరంగా, అన్ పార్లమెంటరీగా మాట్లాడలేదు. నేను మాట్లాడింది సరికాదని ఎవరైనా భావించినా.. అది వారి అభిప్రాయం మాత్రమే. ఓ ప్రజాప్రతినిధిగా నేను అధికారులను ప్రశ్నిస్తాను' అని ప్రెస్ మీలో చెప్పుకొచ్చారు.