జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దాంతో తన సర్కారుకు మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. దీంతో ప్రతిపక్ష బీజేపీ కూడా సమావేశాలకు సిద్ధమవుతోంది. రూల్స్‌కు విరుద్ధంగా సోరెన్ తనకు తానే బొగ్గు గనులను కేటాయించుకున్నారని, ఎమ్మెల్యే పదవికి ఆయన అనర్హుడని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్‌కు సూచించింది. దీనిపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు.