కర్ణాటకలోని దొన్నెహళ్లికి చెందిన రోజారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆమె తల్లిది ఏపీలోని కళ్యాణదుర్గం. ఇక ఐబీఎంలో ఉద్యోగాన్ని రోజారెడ్డి వదిలేసింది. తమ 10 ఎకరాల బీడు భూమిలో ఆర్గానిక్ కూరగాయల సాగు ప్రారంభించింది. తొలుత రూ.2 లక్షల నష్టం వచ్చినా నిరుత్సాహ పడలేదు. ‘నిసర్గా నేటివ్ ఫార్మ్స్’ వెబ్‌సైట్ ప్రారంభించి, తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేసింది. గతేడాది రూ.1.25 కోట్ల టర్నోవర్ సాధించింది.