రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అక్రమ రవాణా నివారణకు ఎస్ఈబి 14500 టోల్‌ఫ్రీ నంబర్ మరియు అవినీతి నిర్మూలన కై ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400 జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అక్రమ మద్యం, గంజాయి, జూదం, నాటుసారాయి మరియు అక్రమ ఇసుక రవాణా ఇతర మత్తుపదార్థాలుకు సంబంధించి ఫిర్యాదు చేయటకు స్పెషల్ ఎంఫోర్స్మెంట్ బ్యూరో 14500 టోల్‌ఫ్రీ నంబర్, అవినీతిని అంతమందించేందుకు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 14400ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ల గోడపత్రికలను జిల్లా ఎస్పీ జి. ఆర్ రాధిక ఆవిష్కరించారు.
అక్రమ రవాణా, అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించి మరియు అవినీతి నిర్మూలనకు ఫిర్యాదు చేయుటకు జిల్లా ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్లు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. పిర్యాదు చేసిన వ్యక్తులు యొక్క వివరాలు గోప్యంగా ఉంచండం జరుగుతుందని ఆమె తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం, గంజాయి, నాటుసారా, ఇసుక ఇతర మత్తుపదార్ధాలు తయారి, రవాణా అరికట్టేందుకు, అవినీతిని నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఈబి టోల్ ఫ్రీ నంబర్ 14500, ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్, 14400, ముఖ్య కూడళ్లలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం మరియు ఆసుపత్రిలో, కళాశాలలో ప్రదర్శించబడాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె శ్రీనివాసరావు, సెబ్ అదనపు ఎస్పి వి. ఎన్. మణికంఠ, అసిస్టెంట్ కమిషనర్ కె. గోపాల్, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ కె గిరిధర్, ఆర్ ఐ ఉమామహేశ్వరావు ఎక్సైజ్ ఎస్ ఐ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.