అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పధకాలు అమలు చేస్తూ ప్రభుత్వ సేవలు పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలని, గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సమస్య లకు మోక్షం కలిగిస్తూన్నరని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మంగళ వారం ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ నగర్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ పర్యటించారు. ఈ సందర్భం పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు తీరు అద్భుతంగా ఉన్నదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
మంగళవారం ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డ్ లో లక్ష్మి నగర్ వీది లో నిన్న సందర్శించగా మిగిలి ఉన్న భాగం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన సంబంధిత అధికారులు, పట్టణ వైసీపీ క్యాడర్ తో పాటు పాల్గొన్నారు. ప్రజల అవసరాలు, ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం విషయంలో గుర్తెరిగి వాటిని అమలు చేస్తూ మనసెరిగిన నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలందిస్తు న్నారని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న పాలన జనరంజకంగా సాగుతోందన్నా రు. ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ సందర్శించిన స్పీకర్ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన లబ్దిదారులకు అందుతున్నా యా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
సమయానికి వృద్దులకు, వితంతువులకు పింఛన్ లు అందుతున్నాయా అని పలువురు వృద్దుల ను, వితంతువులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న దయతో సమయానికే వాలంటీర్లు తీసుకు వచ్చి అందజేస్తున్నారని బదులిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందలేని వారు, సంబందిత సచివాలయం అధికారులు దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్పీకర్ దృష్టికి వచ్చిన పలు సమస్యలను అక్కడే ఉన్న అధికారులుతో చర్చించి పరిష్కారం అయ్యేలా చొరవ చూపారు. మున్సిపాలిటీ మౌళిక వసతుల మెరుగుదలకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు కు సంబంధించిన పూర్తి వివరాలను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన వివరించారు.
వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ పెన్షన్ కానుక, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జరిగిందనే విషయాన్ని స్పీకర్ తమ్మినేని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పారదర్శకతతో జవాబుదారీతనంతో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. పథకాల ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్పీకర్ సూచించారు.
ఒక్కో గ్రామ సచివాలయం పరిధిలో తక్షణం చేపట్టాల్సిన పనులకు రూ. 20 లక్షలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, స్థానిక నాయకులు మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, శిల్లా మల్లి , పొన్నాడ చిన్నారావు, సాదు కామేశ్వరరావు, మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.