బెంగుళూరు నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల ధాటికి ఓ యువతి బలైంది. బెంగుళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ సమీపంలో 23 ఏళ్ల యువతి అఖిల వరద నీటిలో స్కూటీ నుంచి కిందపడింది. పక్కనే ఉన్న విద్యుత్ స్థంబాన్ని పట్టుకోవడంతో షాక్ కు గురై అక్కడికక్కడే చనిపోయింది. అఖిల పాఠశాలలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. తమ కూతురు మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.