ప్రైవేట్ స్కూళ్లలో పేదవిద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా కేటాయించాలన్న తమ ఆదేశాలను పాఠశాల, విద్యాశాఖ అధికారులు అమలు చేయకపోవడంపై సోమవారం హైకోర్టు మండిపడింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పేద పిల్లలకు 25% కోటా స్కూళ్లలో ఉండాలని, లేని పక్షంలో మీకు జైల్లో సీట్లు కేటాయిస్తామని విద్యా శాఖాధికారులకు తేల్చి చెప్పింది. ఎంతమంది సీట్లు పొందారో పూర్తి వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది. విచారణను ఈనెల 7కి వాయిదా వేసింది.