భారత్ బయోటెక్ తయారు చేసిన నాసికా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశంలోనే తొలిసారిగా ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకాగా ఈ వ్యాక్సిన్ నిలిచింది. 18 ఏళ్ల వయసు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ ఇస్తారు. భారత్ లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కరోనా టీకా ఇదే. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా తెలిపారు.