చిత్తూరు: పలమనేరు మండల, పట్టణ ప్రజలందరూ ఈ నెల 11లోపు నిమజ్జనం చేయాలని ఎస్ఐ నాగరాజు మంగళవారం కోరారు. వినాయక చవితి పండుగ సందర్భంగా పలమనేరు మండలంలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కొంతమంది వినాయక విగ్రహాలు నిమజ్జనం చేశారని, మిగిలిన విగ్రహాలు ఆదివారం నిమజ్జనానికి చివరి రోజు కావున భక్తులందరూ మీ మీ వినాయక విగ్రహాలను ఆదివారం లోపల నిమజ్జనం చేసుకోవాలని కోరారు.