కలకాలం కలిసుంటానని వివాహం చేసుకొన్న భార్యను కడతేర్చిన ఘటన ఆర్మూర్ పట్టణంలో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బోధన్ పట్టణానికి చెందిన లక్ష్మణ్‌కు ఎనిమిదేళ్ల క్రితం ఆర్మూర్ పట్టణం సంతోష్‌నగర్‌కు చెందిన స్వప్న(26)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమారులు జన్మించారు. ఆర్మూర్ పట్టణంలోనే అద్దెకు నివాసం ఉంటూ మేస్త్రీ పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్న లక్ష్మణ్ చెడు వ్యసనాలు, తాగుడుకు బానిసయ్యాడు. కొన్నాళ్లుగా భార్యతో తరచూ గొడవలు పడుతున్నాడు. తన తల్లి అనారోగ్యానికి గురైందని స్వప్న ఇటీవల పలుమార్లు పుట్టింటికి వెళ్తూ వచ్చింది. ఈ విషయమై మరోమారు గొడవకు దిగాడు. తనతో ఉండకుండా ఎందుకు మీ ఊరెళ్తున్నావని ఆగ్రహించాడు. అద్దెకు ఉంటున్న ఇంటికి పిలిపించుకొని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. చున్నీతో మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం పెద్ద కొడుకుని ఇక్కడే వదిలేసి, మిగతా ఇద్దరు పిల్లల్ని తీసుకొని పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని ఎస్‌హెచ్‌వో సురేశ్ బాబు పరిశీలించి.. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.