ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా, శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 174 పరుగుల చేసి విజయం సాధించింది.శ్రీలంక ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక 52 పరుగులు, కుశాల్ మెండిస్ 57 పరుగులు చేసారు. షనక 33 పరుగులు, భానుక రాజపక్స 25 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో చాహల్ 3 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa