కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ విశ్వనాథ్ కత్తి(61) మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. బెంగళూరు డాలర్స్ కాలనీలోని తన నివాసంలోని కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉమేష్ మృతికి సీఎం బసవరాజ్ బొమ్మై ఉమేష్ కత్తి అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు.