కోల్కతాలో దారుణం జరిగింది. కిడ్నాప్ అయిన బగుయిహతి ప్రాంతానికి చెందిన అతాను డే, అభిషేక్ నస్కర్ అనే ఇద్దరు బాలురు హత్యకు గురయ్యారు. ఆగస్ట్ 22న కిడ్నాప్ చేసిన వెంటనే కారులోనే చిన్నారులను నిందితులు గొంతు నులిమి చంపేశారు. ఆపై కాలువలో మృతదేహాలను పడవేశారు. వారి మృతదేహాలను పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కేసులో ఇద్దరు అరెస్ట్ అవగా, ప్రధాన నిందితుడు సత్యేంద్ర చౌదరి పరారీలో ఉన్నాడు.