స్టాక్‌మార్కెట్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. గత రెండేళ్ల వ్యవధిలో డీ మ్యాట్ అకౌంట్లు 10 కోట్లు దాటడమే ఇందుకు నిదర్శనం. 2020 మార్చిలో లాక్ డౌన్ విధించినప్పుడు 4.1 కోట్ల డీ మ్యాట్ ఖాతాలు ఉండేవి. రెండేళ్లలో ఎక్కువ కాలం వర్క్ ఫ్రం హోం చేసిన ఉద్యోగులు ఈక్విటీ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. దీంతో డీ మ్యాట్ అకౌంట్లు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ గణాంకాలు వెల్లడించాయి.