మహారాష్ట్ర లాతూర్లో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిర్యానీ ఎందుకు వండలేదని విక్రమ్ వినాయక్ దేదే అనే వ్యక్తి ఆగస్టు 31న తన భార్యతో గొడవ పడ్డాడు. భార్యాభర్తలిద్దరికీ మధ్యం పెద్ద గొడవ జరిగింది. పట్టరాని కోపంతో భార్యను విక్రమ్ కత్తితో పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.