స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లోకి వెళ్లాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 168 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టాలతో స్థిరపడింది. దీంతో ఇండస్ బ్యాంక్, ఎయిర్ టెల్, మహీంద్రా, మారుతి, ఎస్బీఐ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, సన్ ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ సంస్థల షేర్లు లాభాలను పొందాయి.