మధ్యప్రదేశ్ లోని మోరెనాలో ఉన్న అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం దారుణం జరిగింది. ఇద్దరు యువకులపై సుమారు 20 మందికి పైగా ఆర్మీ ఉద్యోగార్థులు కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమపై ఎందుకు దాడిచేశారో తెలియదని బాధితులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa