పాకిస్తాన్ తాజాగా తన సత్తాను ప్రదర్శించింది. ఇదిలావుంటే ఆసియా కప్ సూపర్-4 దశలో నేడు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ చేసింది. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆఫ్ఘన్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసింది. ఇబ్రహీం జాద్రాన్ 35, హజ్రతుల్లా జాజాయ్ 21 పరుగులు చేశారు. చివర్లో రషీద్ ఖాన్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 18 పరుగులు చేశాడు. దాంతో ఆఫ్ఘన్ కు ఆ మాత్రమైనా స్కోరు వచ్చింది. ఆఫ్ఘన్ కెప్టెన్ మహ్మద్ నబీ (0) డకౌట్ అయ్యాడు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ 2 వికెట్లు తీయగా, నసీమ్ షా 1, మహ్మద్ హస్నైన్ 1, మహ్మద్ నవాజ్ 1, షాదాబ్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa