లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగాలు తినడం వల్ల దంతాలు, చిగుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. ప్రయాణంలో లవంగాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం అవ్వడంతో పాటుగా వికారం లాంటివి పోతాయి.శరీరంలోని విష పదార్థాల్ని బయటకు పంపడంలో ఇవి బాగా పనిచేస్తాయి. అలాగే బీపీ, షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. కాలేయం మరియు చర్మ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. లవంగాలతో అల్సర్ సమస్యలకు కూడా ఉపశమనం లభిస్తుంది.