జీపీఎస్ వద్దంటున్న ఉద్యోగ సంఘాలతో మరోసారి చర్చలు జరుపుతామని బొత్స సత్యనారాయణ చెప్పారు. 'GPSలోనూ సదుపాయాలు ఇంకా పెంచుతామని ఉద్యోగులకు వివరించాం. జీపీఎసను అంగీకరించమని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. సవరించిన జీపీఎస్ పై సీఎంతో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తాం. జీపీఎస్‌కు చట్టబద్ధత కల్పిస్తాం. అసెంబ్లీలో చట్టం చేస్తాం. ఉద్యోగులపై నమోదైన కేసులపై సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని ఆయన వెల్లడించారు.