ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా నేడు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఫైనల్ రేస్ నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కేవలం నామమాత్రంగా జరగనుంది. ఆసియాకప్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొందాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో ఇప్పటిదాకా పెద్దగా ప్రభావం చూపని ఓపెనర్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఆఖరాటలో అయినా సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పంత్, దీపక్ హుడాను పక్కనబెట్టి దినేశ్ కార్తీక్‌ను ఆడించడంతో పాటు దీపక్ చహర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఇక, చిన్న టార్గెట్‌ను కాపాడుకునే ప్రయత్నంలో పాకిస్తాన్‌ను వణికించిన అఫ్గాన్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదు. మరి, రోహిత్‌సేన విజయంతో టోర్నీని ముగుస్తుందో లేదో చూడాలి.