ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలోని పేదప్రజల కోసం గడిచిన ఎనిమిదేళ్లలో 3 కోట్ల ఇళ్లు నిర్మించామని ప్రధాని మోదీ తెలిపారు. వీటిలో 10లక్షల ఇళ్లు ఒక్క గుజరాత్ లోనే ఉన్నాయన్నారు. సూరత్ లో మెగా మెడికల్ క్యాంపును వర్చువల్ గా ప్రారంభించిన ఆయన వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముచ్చటించారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతోన్న భారత్.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందన్నారు.