అమరావతి రైతుల పాదయాత్రపై ఇవాళ సాయంత్రంలోగా ఏ విషయం తేల్చాలని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. లేకపోతే శుక్రవారం ఉదయం మొదటి కేసుగా విచారిస్తామని హైకోర్టు తెలిపింది. 'అమరావతి టు అరసవల్లి' పాదయాత్రకు పోలీసులు అనుమతివ్వకపోవడంపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.