ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడు కోటి రూపాయల కరెన్సీ నోట్లతో భక్తులకు దర్శనమిచ్చారు. వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితికి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజుకొక అలంకరణతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గణనాథుడితో పాటు మండపాన్ని సైతం కరెన్సీ నోట్లతో అలంకరించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa