టీచర్ల బదిలీలకు 8ఏళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకోవాలన్న ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తికి సీఎం జగన్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. గతంలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు 8, హెడ్ మాస్టర్లకు ఐదేళ్ల సర్వీసును ప్రామాణికంగా తీసుకునేవారు. ఈసారి అందరికీ ఐదేళ్లే తీసుకుంటున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. దీనివల్ల 80% మంది బదిలీ కావాల్సి వస్తుందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం తాజా నిర్ణయం వారికి ఉపశమనం కలిగించనుంది.