ఆరు నెలల చిన్నారికి ప్రజలు పూజలు చేస్తున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. హింగోలి జిల్లా సెంగావ్ తాలూకాలోని కపాడ్సింగి తండా గ్రామంలో చాలా మంది మూఢనమ్మకాలతో బతుకుతున్నారు. అమ్మవారి ప్రతిరూపమంటూ ఆరు నెలల బాలికకు స్థానికులు పూజలు చేయడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన సుభాష్ దంపతులకు ఆరు నెలల పాప ఉంది. పుట్టుకతోనే పాప నుదుటిపై ఎరుపు, పసుపు రంగు మచ్చలు ఉండటంతో ఆమె దేవత అని పూజిస్తున్నారు.