ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం ఏర్పడి లో కొత్తగా నిర్మించిన పంచాయితీ షాపింగ్ కాంప్లెక్స్ గదులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఏర్పేడులో కొత్తగా రూ. 22 లక్షలతో 6 పంచాయతీ షాపింగ్ గదులను నిర్మించినట్లు వివరించారు. పంచాయతీ పరిధిలో సిమెంటు రోడ్లు, మురుగునీటి కాలువలు, తాగునీటి బోర్లు పలు అభివృద్ధి పనులు చేయించినట్లు పేర్కొన్నారు.