చిత్తూరు, సత్యవేడు: బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం వల్ల వరి రైతులు భారీగా నష్టపోయారు. మండలంలోని తిమ్మాభూపాలపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి, జగన్నాథం, గురవయ్య, నరసింహులు, మోహన్ కు చెందిన పది ఎకరాల్లోని వరి పంట వర్షానికి తడిసి పోయి దెబ్బతింది. అప్పులు చేసి సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు బాధపడుతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.