చిత్తూరు: నారాయణవనం మండల కేంద్రం నారాయణవనం విధుల్లో శనివారం ఉదయం అవనాక్షమ్మ విహరిస్తూ భక్తుల నుంచి హారతులను అందుకున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు సముదాయంలోని టిటిడి అనుబంధ ఆలయమైన అవనాక్షమ్మ ఆలయంలో వార్షిక ఉత్సవాలు వివరిస్తున్నారు. ట్రాక్టర్ పై అమ్మవారిని సుందరంగా అలంకరించి పుష్ప ప్రభపై అధిష్టింప చేసి గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. యువకులు రంగులు చల్లుకుని కోలాహలంగా ఊరేగింపులో పాల్గొన్నారు.