భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. సోమవారం బాపట్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరద ఉధృతి నుంచి ప్రజలను కాపాడేందుకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రేపల్లె, కొల్లూరు, భట్టిప్రోలు, చోడాయపాలెం తీరం వెంబడి గస్తీ ఏర్పాటు చేశామన్నారు