ఛత్తీస్గఢ్ కోర్బా జిల్లాలో సోమవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపోర్దా హైవేపై ఓ మెట్రో బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 12 మంది తీవ్రగాయాలపాలయ్యారు. హైవే పెట్రోల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఓ చిన్నారి సహా ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.