బెంగళూరులో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గోవింద్ నందకుమార్ ఆగస్టు 30న ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. అయితే అదే సమయంలో ఓ రోగికి ఆయన సర్జరీ చేయాల్సి ఉంది. దీంతో కారు దిగి 3 కిలో మీటర్ల దూరం పరుగెత్తి హాస్పిటల్‌కు చేరుకున్నారు. సకాలంలో సర్జరీ చేసి రోగి ప్రాణాలు కాపాడారు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.